యూఎస్ మ‌రో కీల‌క నిర్ణ‌యం… 18 ఏళ్లు దాటిన వారికి…

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు టీకా తీసుకోవ‌డం ఒక్క‌టే మార్గం కావ‌డంతో ప్ర‌పంచంలో కోట్లాది మందికి టీకాలు వేస్తున్నారు.  18 ఏళ్లు నిండిన అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాలని నిబంధ‌న‌లు ఉండ‌టంతో వేగాంగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.  ఇక‌, చిన్నారుల‌కు కూడా వ్యాక్సిన్ ఇచ్చే ప్ర‌క్రియ కొన్ని దేశాల్లో మొద‌లైంది.  కాగా, ఇప్పుడు అమెరికా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  18 ఏళ్లు నిండిన అంద‌రికీ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తి ఇచ్చింది.  రెండు డోసులు తీసుకున్న‌వారు బూస్ట‌ర్ డోస్ కింద ఏ కంపెనీ వ్యాక్సిన్ అయినా తీసుకోవ‌చ్చ‌ని, బూస్ట‌ర్ డోస్ మ‌రింత ర‌క్ష‌ణ ఇస్తుందని అధికారులు చెబుతున్నారు.  

Read: అమెరికాలో అధికారాలు బ‌ద‌లీ… తాత్కాలిక అధ్య‌క్షురాలిగా క‌మ‌లా హారిస్‌…

శీతాకాలం ప్రారంభం అవుతుండ‌టంతో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభించే అవ‌కాశం ఉంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్న‌ది.  గ‌తంలో 65 ఏళ్లు నిండిన వారికి, ఆరోగ్య‌స‌మ‌స్య‌లు అధికంగా ఉన్న‌వారికి బూస్ట‌ర్ డోస్ ఇచ్చేవారు.  అయితే, ఇప్పుడు అంద‌రికీ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ప్ర‌పంచంలో చివ‌రి వ్య‌క్తి వ‌ర‌కు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాకే బూస్టర్ డోస్ కు అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఇప్ప‌టికే ప‌లుమార్లు పేర్కొన్న‌ది.  అయితే, ఇప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణ‌యంపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.  

Related Articles

Latest Articles