పుతిన్‌కు అమెరికా ప్రెసిడెంట్ జో వార్నింగ్‌… దేనికంటే…

అమెరికా టెకీ సంస్థ‌ల‌పై రాన్స‌మ్‌వేర్ దాడులు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.  ప‌లు టెకీ కంపెనీలు ఈ రాన్స‌మ్ వేర్ బారిన ప‌డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  ర‌ష్యాకు చెందిన హాకర్లు ఈ దాడులు చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో యూఎస్ ప్ర‌భుత్వం స్పందించింది.  అధ్య‌క్షుడు జో బైడెన్ రష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.  రాన్స‌మ్‌వేర్ దాడుల‌ను అడ్డుకోవాల‌ని లేదంటే తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కొవ‌ల‌సి వ‌స్తుంద‌ని అన్నారు.  

Read: “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”… ఫ్యాన్స్ కు పండగే ఇక !

ఈ రాన్స‌మ్‌వేర్ దాడులు ర‌ష్యా నుంచే జ‌రుగుతున్న‌ట్టు త‌మ‌వ‌ద్ధ స్ప‌ష్ట‌మైన ఆధారాలు ఉన్నాయని, ఈ దాడుల వెనుక ప్ర‌భుత్వం లేకున్నా, ఎవ‌రు చేస్తున్నారో తెలుసుకొని, తాము స‌మాచారం ఇస్తే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జో బైడెన్ ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ను కోరారు.  రెండు దేశాల మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు నెల‌కొంటున్న స‌మ‌యంలో ఇలాంటి దాడులు జ‌రగ‌డం వ‌ల‌న తిరిగి ప‌రిస్థితులు గ‌తంలో మాదిరిగా మారిపోయో అవ‌కాశం ఉంటుంది.  ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం త‌రువాత అమెరికా, ర‌ష్యా దేశాల మ‌ధ్య సంబంధాలు తెగిపోయిన సంగ‌తి తెలిసిందే. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-