అమెరికా సీవుల్ఫ్‌కు ప్ర‌మాదం… చైనాకు క‌లిసివ‌స్తుందా?

ద‌క్షిణ చైనా స‌ముద్రంలో చైనా దేశం ఆదిప‌త్యం సంపాదించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ది.  ఈ జ‌లాల ప‌రిధిలోని దీవులు, దేశాలు త‌మ‌వే అని వాదిస్తోంది.  తైవాన్‌ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.  తైవాన్‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు అమెరికా  ఆ దేశానికి స‌మీపంలో గువామ్ నావికాద‌ళాన్ని ఏర్పాటు చేసింది.   అమెరికాకు చెందిన అణుశ‌క్తి జ‌లాంత‌ర్గామి యూఎస్ఎస్ క‌నెక్టిక‌ట్ ఈ జ‌లాల్లో ప‌హారా కాస్తుంటుంది.  ద‌క్షిణ చైనా స‌ముద్రంలోని అంత‌ర్జాటీయ జ‌లాల్లోకి ప్ర‌వేశించే స‌మ‌యంలో ఈ జ‌లాంత‌ర్గామి ప్ర‌మాదానికి గురైంది.  అక్టోబ‌ర్ 2 న ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు స‌మాచారం.  అయితే, ప్ర‌మాదం స్వ‌ల్ప‌మేన‌ని, అందులోని సిబ్బందికి పెద్ద‌గా గాయాలు కాలేద‌ని, అణురియాక్ట‌ర్‌కు కూడా ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని అమెరికా చెబుతున్న‌ది.  త్వ‌ర‌లోనే ఈ అణుజ‌లాంత‌ర్గామి గునామ్ నావికాకేంద్రానికి చేరుకునే అవ‌కాశం ఉన్న‌ది.  అప్ప‌టికి ప్ర‌మాదంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది.  ఒక‌వేళ ప్ర‌మాదం పెద్ద‌ది అయితే,  ఈ అణుజలాంత‌ర్గామి విధుల నుంచి ప‌క్క‌కు త‌ప్పుకొవాల్సి ఉంటుంది. ఇదే జ‌రిగితే చైనాకు ఇది క‌లిసివ‌చ్చే అంశంగా మారుతుంది.  తైవాన్‌పై మ‌రింత ప‌ట్టు సాధించేందుకు చైనాకు అవ‌కాశం క‌లుగుతుంది.  సీవుల్ఫ్ అత్యంత శ‌క్తివంత‌మైన జ‌లాంత‌ర్గాములుగా పేరున్న సంగ‌తి తెలిసిందే.  ర‌ష్యాతో కోల్ట్ వార్ స‌మ‌యంలోనే వీటిని అమెరికా త‌యారు చేసుకున్న‌ది.  

Read: పాక్ జ‌ట్టుకు బంప‌ర్ ఆఫ‌ర్‌: ఇండియాను ఓడిస్తే…

-Advertisement-అమెరికా సీవుల్ఫ్‌కు ప్ర‌మాదం... చైనాకు క‌లిసివ‌స్తుందా?

Related Articles

Latest Articles