చైనా రాకెట్ కూలేది అక్కడే.. గుర్తించిన అమెరికా

చైనా రాకెట్ భూమిపై కూలే ప్రాంతాన్ని యూఎస్ రక్షణ శాఖ తాజాగా గుర్తించింది. ఆదివారం ఉదయం 4:30 గంటలకు రాకెట్ శకలాలు భూమిని ఢీకొంటాయని అంచనా వేసింది. మధ్య ఆసియాలోని తుర్క్ మెనిస్థాన్ లో కూలే అవకాశం ఉందని పేర్కొంది యూఎస్ రక్షణ శాఖ. అయితే చైనా మాత్రం ఈ విషయంలో పెద్దగా ప్రమాదం ఉండబోదనే చెబుతోంది. శకలాలు భూమిని చేరేలోపే పూర్తిగా కాలిపోతాయని, ప్రమాదం జైగే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతోంది. అయితే ఎక్కడ పడేది మాత్రం చైనా చెప్పలేదు. కాగా ఏప్రిల్ 29 న లాంగ్ మార్చి 5-బీ రాకెట్ ను చైనా ప్రయోగించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-