యూఎస్ కీల‌క నిర్ణయం: ఆ దేశానికి వెళ్ల‌కండి…

ప్ర‌పంచంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది.  ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశంలో ఈ వేరియంట్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయి.  ఆనెల 19 నుంచి ఆ దేశంలో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించారు.  మాస్క్ విష‌యంలో కూడా స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.  గుంపులుగుంపులుగా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.  మాస్క్ కూడా ధ‌రించ‌క పోవ‌డంతో డెల్టా వేరియంట్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయి.  గ‌డిచిన వారం రోజుల కంటే ఆదివారం రోజున కేసులు 52 శాతం పెరిగిన‌ట్టు నివేదిక‌లు చెబుతున్నాయి.  దీంతో అమెరికా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  బ్రిటన్ అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్పించి వెళ్లొద్ద‌ని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాల‌ని హెచ్చ‌రించింది.  అమెరికా ప్ర‌భుత్వం ట్రావెల్ గైడ్‌ను అప్‌డేట్ చేసింది.  

Read: ‘జూబిలీ కుమార్’ రాజేంద్రకుమార్

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-