నాటో బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ‌పై యూఎస్ మాజీ అధ్య‌క్షుడు ఘాటు వ్యాఖ్య‌లు…

ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి నాటో బ‌ల‌గాలు త‌ప్పుకుంటున్నాయి.  నాటో, అమెరికా బ‌ల‌గాలు త‌ప్పుకోవ‌డంతో ఆ దేశంలో తాలిబ‌న్లు రెచ్చిపోతున్నారు.  ఇప్ప‌టికే ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని అనేక ప్రాంతాల‌ను తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు త‌మ ఆదీనంలోకి తీసుకున్నారు.  ప్ర‌తిరోజు అక్క‌డ హింస‌లు చెల‌రేగుతున్నాయి.  ఉగ్ర‌వాదుల దౌర్జ‌న్యాల‌కు అమాయ‌క‌మైన ప్ర‌జ‌లు బ‌లి అవుతున్నారు.  అమెరికా, నాటో బ‌ల‌గాలు త‌ప్పుకోవ‌డంపై అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ విమ‌ర్శించారు.  అమెరికా, నాటో బ‌ల‌గాలు ఆఫ్ఘ‌న్ నుంచి తప్పుకోవ‌డం మంచి నిర్ణ‌యం కాద‌ని, బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ త‌రువాత ఆఫ్ఘ‌న్ దేశంలో హింస పెరిగిపోతున్న‌ద‌ని, మ‌హిళ‌లు, చిన్నారులు ఉగ్ర‌వాదుల చెతుల్లో చిక్కి ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని, జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే త‌న హృద‌యం ఎంత‌గానో బాధ‌ప‌డుతున్న‌ద‌ని అన్నారు.  

Read: ఓటిటి కోసం రాశిఖన్నా క్రేజీ రోల్ ?

2001 సెప్టెంబ‌ర్ 11 వ తేదీన న్యూయార్క్ న‌గ‌రంలోని వ‌రల్డ్ ట్రేడ్ ట‌వ‌ర్స్ పైన జ‌రిగిన దాడి త‌రువాత ఆల్‌ఖైదా, తాలిబ‌న్ ఉగ్ర‌వాదుల‌ను స‌మూలంగా ఏరివేసేందుకు అమెరికా, నాటో దేశాలు త‌మ బ‌ల‌గాల‌ను అఫ్ఘ‌నిస్తాన్‌కు పంపాయి.  రెండు ద‌శాబ్ధాల త‌రువాత 2021 సెప్టెంబ‌ర్ 11 వ‌ర‌కు ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ పూర్తి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నా అంత‌కంటే ముందుగానే జున్ నెలాఖ‌రు వ‌ర‌కు ద‌ళాల‌ను పూర్తిగా ఉప‌సంహ‌రించుకున్నాయి.  దీంతో ఆఫ్ఘ‌న్‌లో మ‌రోసారి అంత‌ర్గ‌త యుద్ధం జరుగుతున్న‌ది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-