చైనాపై మ‌రోసారి విరుచుకుప‌డిన ట్రంప్‌…

ట్రంప్ ఒట‌మికి బ్లాక్ లైవ్స్ మ్యాట‌ర్ ఒక‌కార‌ణ‌మైతే, ప్ర‌ధాన కార‌ణం మాత్రం క‌రోనా మ‌హ‌మ్మారినే అని చేప్పాలి.  క‌రోనాను కంట్రోల్ చేయ‌డానికి స‌రైన నిర్ణ‌యాలు తీసుకోలేద‌ని అమెరికా ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు చేశారు. అమెరికా ఆర్ధిక వ్య‌వ‌స్థ గురించి ఆలోచించిన ట్రంప్, క‌రోనా క‌ట్ట‌డిలో విఫ‌లం అయ్యార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అదే స‌మ‌యంలో ట్రంప్ చైనాపై అనేక‌మార్లు విరుచుకుపడిన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా వైర‌స్ చైనా నుంచే అమెరికాకు వ‌చ్చింద‌ని, ప్ర‌పంచం మొత్తం క‌రోనాతో అత‌లాకుత‌లం కావ‌డానికి చైనానే కార‌ణం అని ప‌లుమార్లు విమ‌ర్శించ‌డ‌మే కాకుండా, అమెరికాకు, ప్ర‌పంచానికి చైనా 10 ట్రిలియ‌న్ డాల‌ర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.  అంత‌ర్జాతీయ సంస్థ‌లు సైతం చైనా ల్యాబ్ నుంచే క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌కు వ‌చ్చినట్టు తెలియజేశాయి.  దీంతో ట్రంప్ మ‌రోసారి చైనాపై విరుచుకుప‌డ్డారు.  చైనా నుంచే కోవిడ్ వైర‌స్ వ‌చ్చింద‌ని తాను ముందుగానే చెప్పాన‌ని, త‌ప్ప‌నిస‌రిగా చైనా భారీ మూల్యం చెల్లించాల‌ని ట్రంప్ పేర్కొన్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-