వ్యాక్సిన్ లపై బిడెన్ కీలక నిర్ణయం

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్.. మన ఇండియాను కుదిపేస్తోంది. అటు కేసులు పెరగడం, ఇటు వ్యాక్సిన్ల కొరత చాలా ఇబ్బందిగా మారింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న వ్యాక్సిన్ల కొరత తీర్చేందుకు.. అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాల పేటెంట్స్ రద్దుకు మద్దతు తెలిపింది అమెరికా ప్రభుత్వం. వ్యాక్సిన్ల మేధో సంపత్తి హక్కులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. అమెరికా తాజా నిర్ణయం తో ప్రపంచ దేశాలకు ఎంతో ఉపయోగం కలుగనుంది. ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలు అన్ని రకాల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే ఛాన్స్ ఉంది. ఫార్ములా ఇతర దేశాలతో పంచుకోవచ్చు. కరోనా పోరులో దీన్ని కీలక ఘట్టంగా అందరూ భావిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం WHO తో కలిసి పనిచేయనుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-