తేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్… చికిత్స విజయవంతం

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అనంతరం అపోలో ఆసుపత్రి ఐసీయూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మూడవ రోజు కూడా చికిత్స కొనసాగుతోంది. ఇక పరీక్షల్లో తేజ్ కు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందని, శస్త్ర చికిత్స చేయాలనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వైద్యులు తేజ్ కు ఆ శస్త్ర చికిత్సను చేసి హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. అందులో తేజ్ వైద్యానికి బాగా స్పందిస్తున్నాడని, కోలుకుంటున్నాడని తెలిపారు. కాలర్ బోన్ ఫ్రాక్చర్ ప్రక్రియను మల్టీడిసిప్లినరీ నిపుణుల బృందం విజయవంతంగా పూర్తి చేసింది. తేజ్ ఇంకా అబ్జర్వేషన్ లోనే ఉంటాడు” అని స్పష్టం చేశారు. కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తవ్వడం మెగా అభిమానులకు సంతోషం కలిగించే విషయం. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు సెలెబ్రిటీలు సైతం ప్రార్థిస్తున్నారు.

తేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్… చికిత్స విజయవంతం

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-