“భీమ్లా నాయక్” అప్డేట్… ఈరోజే ఆ సర్ప్రైజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో స్టార్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న యాక్షన్ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఎస్ రాధాకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. “భీమ్లా నాయక్” సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన “భీమ్లా నాయక్” టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇంతవరకూ సినిమా నుంచి రానాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ను మేకర్స్ విడుదల చేయకపోవడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

Read Also : శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో సామ్ నెక్స్ట్ మూవీ ?

అయితే రానా కోసం కూడా ప్రత్యేకంగా సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నామంటూ మేకర్స్ వారిని కూల్ చేశారు. అప్పటి నుంచి “భీమ్లా నాయక్” నుంచి రానా పాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా ? అని ఆసక్తిగా ఎదురు చూస్తోంది టాలీవుడ్. వారి నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైందని తాజా అప్డేట్ తెలుపుతోంది. తాజా బజ్ ప్రకారం సెప్టెంబర్ 17 న అంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు “భీమ్లా నాయక్” అప్డేట్ రాబోతోంది. డేనియల్ శేఖర్‌గా రానాను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను లేదా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ విడుదల చేసే ఛాన్స్ ఉంది.

-Advertisement-"భీమ్లా నాయక్" అప్డేట్… ఈరోజే ఆ సర్ప్రైజ్

Related Articles

Latest Articles