ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన ట్విట్ట‌ర్ః ఆ కేసులో వాగ్మూలం ఇచ్చేందు పోలీస్ స్టేష‌న్‌కు…

ఇండియాలో ట్విట్ట‌ర్‌కు కేంద్రానికి మ‌ధ్య‌వార్ జ‌రుగుతున్న‌ది.  కొత్త ఐటీ చ‌ట్టాల‌ను ట్విట్ట‌ర్ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో కేంద్రం నోటీసులు జారీ చేసింది.  మ‌రోవైపు ఓ వీడియో కేసులో ట్విట్ట‌ర్‌పై యూపీలో కేసులు న‌మోద‌య్యాయి.  యూపీకి చెందిన ఓ వ్య‌క్తి త‌న‌ను కొంత‌మంది కొట్టార‌ని చెప్పి వీడియోను తీసి దానిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.  దీనిని కొంత మంది నేత‌లు షేర్, లైక్ చేయ‌డంతో ఈ వీడియోపై ట్విట్ట‌ర‌పై కేసులు నమోద‌య్యాయి.  తాయ‌త్తులు అమ్ముతూ జీవ‌నం సాగించే వ్య‌క్తి కొంత‌మందికి తాయ‌త్తులు అమ్మార‌ని, అవి ప‌నిచేయ‌క‌పోవ‌డంతో కొంద‌మంది వ్యక్తులు తాయ‌త్తులు అమ్మిన వ్య‌క్తిపై దాడులు చేశార‌ని, దాడి చేసిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారని, పోలీసులు చెబుతున్నారు. 

Read: “సిగ్గు ఎందుకురా మామ” అంటున్న సుకుమార్


 మ‌త‌ప‌ర‌మైన అల్ల‌ర్ల‌కు ఇలాంటివీడియోలు కార‌ణం అవుతున్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు.  అయితే, ట్విట్ట‌ర్ పై కేసులు పెట్ట‌డానికి కార‌ణం 500 వ‌ర‌కు అకౌంట్‌ల‌ను విత్‌హెల్డ్‌లో పెట్ట‌డ‌మే.  విత్‌హెల్డ్ లో పెట్టిన మెసేజ్‌లు, వీడియోలు ఇండియాలో క‌నిపించ‌వు.  కానీ, బ‌య‌ట దేశాల్లో క‌నిపిస్తాయి.  అయితే, ట్విట్ట‌ర్ ఇండియా హెడ్‌ను ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఉన్న పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చి వాగ్మూలం ఇవ్వాల‌ని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.  కానీ, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వాగ్మూలం ఇస్తాన‌ని ట్విట్టర్ ఇండియా హెడ్ చెప్పినా, అందుకు పోలీసులు అంగీక‌రించ‌లేదు.  దీంతో గురువారం రోజున ట్విట్ట‌ర్ ఇండియా హెడ్ మ‌నీష్ మ‌హేశ్వ‌రీ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి వాగ్మూలం ఇవ్వ‌నున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-