యూపీలో బీజేపీకి మ‌రో షాక్‌… ఎస్పీ చెంత‌కు మ‌రో మంత్రి…

వ‌చ్చే నెల‌లో యూపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అన్నిపార్టీలు ప్ర‌చారానికి సిద్ధం అవుతున్నాయి.  అధికారంలో ఉన్న బీజేపీకి యూపీలో ప్ర‌స్తుతం ఎదురుగాలి వీస్తున్న‌ది.  రైతులు ఉద్య‌మం త‌రువాత బీజేపీ గ్రాఫ్ క్ర‌మంగా ప‌డిపోవ‌డంతో బీజేపీ నుంచి నేత‌లు జంప్ అవుతున్నారు.  ఇప్ప‌టికే ఇద్ద‌రు నేత‌లు బీజేపీని వీడ‌గా తాజాగా మ‌రో మంత్రి బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఎస్పీలో చేరిపోయారు.  వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన స్వ‌తంత్ర మంత్రి ధ‌ర‌మ్ సింగ్ షైనీ పార్టీని వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  

Read: వైద్య సంక్షోభంలో యూఎస్‌…!!?

ఎమ్మెల్యే ముఖేష్ వ‌ర్మ బీజేపీని వీడిన కొద్ది గంట‌ల్లోనే మంత్రి ధ‌ర‌మ్ సింగ్ కూడా పార్టీని వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు మంత్రులు బీజేపీని వీడారు.  కేబినెట్ మంత్రి స్వామి ప్ర‌సాద్ మౌర్య త‌న ప‌లుకుబ‌డితో తన‌కు అనుకూలంగా ఉన్న నేత‌ల‌ను బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.  నేత‌లు పార్టీని వీడుతున్న‌ప్ప‌ట‌కి బీజేపీ మాత్రం నోరు మెద‌ప‌డం లేదు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దే అని ధీమాను వ్య‌క్తం చేస్తున్న‌ది బీజేపీ.  

Related Articles

Latest Articles