క‌రోనా ఎఫెక్ట్.. యూపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

భార‌త్‌తో క‌రోనా మ‌హ‌మ్మారి సేకండ్‌వేవ్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. దీంతో.. కోవిడ్ క‌ట్ట‌డికి వివిధ రాష్ట్రాలు క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి.. కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి కొన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తుంటే.. మ‌రికొన్ని రాష్ట్రాలు.. నైట్ క‌ర్ఫ్యూ విధిస్తున్నారు.. తాజాగా మ‌రో రాష్ట్రం ఈ జాబితాలో చేరింది.. ఉత్తర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సైతం క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ఈ వారం నుంచి క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గేవ‌ర‌కు ప్ర‌తి వారం శ‌ని, ఆదివారాల్లో వీకెండ్ లాక్‌డౌన్ విధించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం యోగి ఆదిత్య‌నాథ్.

అయితే, ఇది కేవ‌లం ప‌ట్ట‌ణాల‌కే మాత్రం గ్రామ స్థాయి వ‌ర‌కు ఈ నిబంధ‌న‌లు కొన‌సాగ‌నున్నాయి.. 500కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదైన ప్ర‌తీ గ్రామంలో క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయి.. ఇక‌, వీకెండ్ లాక్‌డౌన్.. శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు ఈ లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది ప్ర‌భుత్వం.. లాక్‌డౌన్ స‌మ‌యంలో కేవ‌లం అత్యావ‌స‌ర‌, నిత్యావ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని పేర్కొంది స‌ర్కార్. అయితే, ఇవాళ్టి నుంచి నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి రానుకుండ‌గా.. ఈ నెల 24వ తేదీ నుంచి వారాంత‌పు లాక్‌డౌన్‌ను అమ‌లు చేయ‌నున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-