కేంద్రమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి

ఉత్తరప్రదేశ్‌లోని లకీంపూర్ కేర్ దాడిలో చనిపోయిన రైతుల చితాభస్మాన్ని ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తీసుకువచ్చారు రైతు సంఘాల నాయకులు శ్రీనివాసరావు, గపూర్. గన్నవరం విమానాశ్రయంలో చితాభస్మాన్ని తీసుకువచ్చిన రైతులకు స్వాగతం పలికారు మాజీ మంత్రి వడ్డే శోభనద్రీశ్వరరావు, ఇతర రైతు సంఘాల నాయకులు. లకీంపూర్ కేర్ దాడి చేసిన కేంద్ర సహాయ మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాని వెంటనే చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు రైతు సంఘాల నాయకులు. కేంద్ర ప్రభుత్వం చేసిన 3 రైతు చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు రైతు నాయకులు. ఈనెల 26న విజయవాడలో కృష్ణా నదిలో చితాభస్మాన్ని కలపనున్నామని తెలిపారు రైతు సంఘాల నాయకులు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Related Articles

Latest Articles