కారు కోసం బాబును అమ్మేసిన అమ్మానాన్న…

ఓ సెకెండ్ హ్యాండ్ కారు కోసం అమ్మానాన్న క‌న్న కొడుకునే అమ్మేసిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. అయితే ఆ బాబు తాత ఫిర్యాదుతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ బాబు త‌ల్లిదండ్రులు గుర్సా హైగంజ్ కు చెందిన ఓ వ్యాపార‌వేత్త‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. త‌మ కుమారుడిని.. రూ.1.5 ల‌క్ష‌ల క్యాష్ కు డీల్ కుదుర్చుకున్నారు. డీల్ ప్ర‌కారం పిల్లాడిని తీసుకుని డ‌బ్బులు ఇచ్చేశాడు వ్యాపార‌వేత్త‌.

అయితే పిల్లాడి తాతకు విష‌యం తెలియ‌డంతో త‌ల్లిదండ్రుల‌ను నిల‌దీశాడు. విషయం తెలిసిన వెంట‌నే పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి కంప్ల‌యింట్ చేశాడు. ప్ర‌స్తుతానికి శిశువు వ్యాపారి ద‌గ్గ‌రే ఉండ‌గా.. పేరెంట్స్ ని పిలిచి వివ‌రాలు సేకరించారు పోలీసులు. బాబును అమ్మిన‌ది వాస్త‌వ‌మేన‌ని విచార‌ణ‌లో ఒప్పుకున్నారు పేరెంట్స్‌. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-