యోగి సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. విద్యుత్‌ చార్జీలు భారీగా తగ్గింపు..!

త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం రోజు విడుదల చేసింది… ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.. ఈ ఎన్నికల్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది.. ఫిబ్రవరి 10వ తేదీన తొలి దశ పోలింగ్ ప్రారంభం కాబోతోంది.. అయితే, ఎన్నికలకు ముందు సామాన్యులకు, రైతులకు భారీ ఊరట కలిగించేలా శుభవార్త వినిపించింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్.

Read Also: ఆ మోజు ఉంటే చంద్రబాబు రాజీనామా చేయాలి-రోజా

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు అమలు అవుతోన్న విద్యుత్‌ చార్జీల్లో భారీగా కోత విధించింది.. రైతులకు ప్రయోజనం కలిగేలా బోరు బావుల విద్యుత్ బిల్లులను తగ్గించింది. పట్టణాల్లో మీటరు ఉన్న బోరుబావుల కనెక్షన్ల యూనిట్ ధరను రూ.6 నుంచి రూ.3కు కుదించిన యోగి సర్కార్.. గ్రామీణ మీటర్ల పంప్ కనెక్షన్ల యూనిట్ ధరను రూ.2 నుంచి రూ.1కి పరిమితం చేసింది. ఇక, టౌన్లలో ఫిక్స్‌డ్‌ చార్జీల రేటు హార్స్​పవర్​కు రూ.130 నుంచి రూ.65కు… గ్రామాల్లో రూ.70 నుంచి రూ.35కు కుదించిన బీజేపీ ప్రభుత్వం.. మీటర్లు లేని కనెక్షన్లకు రేటును హార్స్​పవర్​కు రూ.170 నుంచి రూ.85కు తగ్గించింది.. విద్యుత్‌ చార్జీల తగ్గింపుపై సోషల్ మీడియాలో స్పందించిన సీఎం యోగి ఆదిత్యానథ్.. రైతులు ఆనందంగా ఉంటేనే ఉత్తరప్రదేశ్ స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.. అందుకే రైతులకు ప్రయోజనాలు కలిగే విధంగా విద్యుత్‌ చార్జీలను 50 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే, ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే.. ఈ నిర్ణయం తీసుకుంది యూపీ ప్రభుత్వం.

Related Articles

Latest Articles