ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం…

ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అయితే దేశ రాజధానిలో జూన్ 14 వ తేదీ వరకు మరో వారం “లాక్ డౌన్” పొడిగించింది ప్రభుత్వం. క్రమేపి “లాక్ డౌన్” సడలింపు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. మూడవ విడత “కరోనా” విజృంభణను అడ్డుకునేందుకు, సంసిధ్దత ఏర్పాట్లలో నిమగ్నమైంది ఢిల్లీ ప్రభుత్వం. మూడవ విడత లో చిన్న పిల్లల పై తీవ్ర ప్రభావం ఉంటుందన్న హెచ్చరికలతో నిశిత పరిశీలనకు నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. 50 శాతం సామర్థ్యంతో మెట్రో రైలు సర్వీసులను సోమవారం నుంచి పునరుధ్దరించాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి “సరి-బేసి” సంఖ్యల ఆధారంగా దుకాణాలను తెరిచేందుకు అనుమతులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. పరిస్థితి మెరుగుపడే కొద్దీ క్రమేపి మరిన్ని సడలింపులు చేయనుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-