బిర్సా ముండా జయంతి.. ఆయన అనుచరుల పాదాలు కడిగిన కేంద్ర మంత్రులు..

ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్యా ముండా జయంతి సందర్భంగా.. ఆయన జన్మస్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రలు అర్జున్‌ ముండా, జి. కిషన్‌ రెడ్డి.. బిర్సా ముండా అనుచరులను సన్మానించారు.. ఝార్ఖండ్‌లోని బిర్సా ముండా జన్మస్థలం ఖుంటి జిల్లాలోని ఉలిహటు గ్రామంలో ఈరోజు ఆయన జయంతి వేడుకలు నిర్వమించారు.. ఈ సందర్భంగా ఆయన అనుచరుల పాదాలను కడిగి.. సన్మానించారు అర్జున్ ముండా, జి కిషన్ రెడ్డి..

కాగా, 1875లో జన్మించిన బిర్సా ముండా.. 1900లో కన్నుమూశారు.. అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడిగా పేరుపొందారు.. బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించారు.. తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు.. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో చిత్రపటం ఏర్పాటు చేశారు.. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆదివాసీ నేత బిర్సా ముండా. బ్రిటిషు వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు. కనీసం పాతికేళ్లు కూడా దాటకుండానే ఇవన్నీ సాధించడం వల్ల ఈయన ఘనత సాధించారు.

Related Articles

Latest Articles