సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…

హుజూరా బాద్ ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఓటర్లందరికి డబ్బులు పంచిన అధికార పార్టీ పోయింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వివిధ పార్టీల నేతలను కొనుగోలు చేశారు… ఓటర్లను ప్రలోభ పెట్టె అన్ని పనులు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంత హుజూరాబాద్ లో పని చేసినది… హుజూరాబాద్ లో స్టేట్ సెక్రటేరియట్ ఉందా అనే విదంగా చేశారు. సీఎం విలేజ్ వైస్ మానిటరింగ్ చేశారు కేసీఆర్ కుటుంబందే, మా బెదిరింపు లదే విజయం అని అనుకున్నాడు కానీ జరగలేదు. దళితులు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఆగం అవుతుంది, అభివృద్ధి చెందదు అని సీఎం మాట్లాడారు. అంటే దళితులు ముఖ్యమంత్రి గా పనికి రారా అని ప్రశ్నించారు.

ఇక దేశ వ్యాప్తంగా 130 గ్రామాలు జాబితా వస్తే పోచంపల్లి గ్రామాన్ని యునెస్కో కు ప్రతిపాదించాను అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో వ్యవసాయం తర్వాత చేనేత మీద నే ఎక్కువ గా ఆధారపడుతారు. రామప్ప విషయం లో చివరగా నేను ప్రయత్నం చేశాను. భద్రాచలం ను శ్రీ రామ సర్క్యూట్ లో  చేర్పించాను. డిసెంబర్ 6 అంబెడ్కర్ వర్దంతి సందర్భంగా 10 లక్షల మంది విద్యార్థుల అకౌంట్స్ లో స్కాలర్షిప్స్ జమా అవుతాయి. సుభాష్ చంద్ర బోస్ తో సంబంధం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ముగ్గుల పోటీ ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో ఈ పండుగ ను వివిధ పేర్లతో నిర్వహిస్తారు అని తెలిపారు.

Related Articles

Latest Articles