తెలంగాణకి కోటికి పైగా వ్యాక్సిన్ డోస్ కావాలి…

తెలంగాణకి 71 లక్షల 23 వేల 50 వ్యాక్సిన్ డోస్‌లు వచ్చాయి అని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్ 65,86,650 డోస్‌లు.. 27 ప్రైవేట్ హాస్పిటల్స్ కి 5,36 ,600 డోస్‌లు చేరాయి. రేమిడిసివిర్ తెలంగాణకి 3 లక్షలు.. ఆంధ్ర కు 6 లక్షలు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది. ఇతర దేశాల నుండి వ్యాక్సిన్ ప్రోక్యూర్ పై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయి. కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుంది అని అంటున్నాయి.. కేంద్రం వ్యాక్సిన్ సేకరణని సరళీకృతం చేసింది. అయితే తెలంగాణకి కోటి వ్యాక్సిన్ డోస్ లే కాదు ఇంకా కావాలి. సెప్టెంబర్ వరకు వ్యాక్సిన్ ఉత్పత్తి పెరుగుతోంది… కొరత తగ్గుతుంది. ఇక జూన్ 30 వరకు లాక్ డౌన్ పెట్టుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. పెట్టుకోవాల లేదా అనేది ఆయా రాష్ట్రాల ఇష్టం అని అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-