హరీశ్ రావు పై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి…

వ్యాక్సినేషన్ పంపిణి పై హరీశ్ రావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. వ్యాక్సిన్ పై కొందరు కేసీఆర్ కుటుంబ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో కూర్చిని గ్లోబల్ టెండర్లు వేస్తే ఎవరూ ముందుకు రారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉంది. విదేశాంగ మంత్రి వ్యాక్సిన్ ముడి సరుకు కోసం ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నారు. దేశంలోని హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఒక్కటే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తోంది. ఇది ఇక్కడే వాడాలని అనడం సరికాదు. ఇతర ప్రదేశాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ ఇక్కడకు రావడం లేదా అని ప్రశ్నించారు. డిసెంబరు నాటికి రాష్ట్రాలు కొనుగోలు చేసినా చేయక పోయినా కేంద్రం కొనుగోలు చేసి వ్యాక్సిన్ అందరకీ వేస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ కొనుగోలు చేసింది నాలుగున్నర లక్షల డోసులే. 75 లక్షల డోసులు కేంద్రమే ఉచితంగా ఇచ్చింది అని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-