టీఆర్‌ఎస్‌ నేతల కోవిడ్‌ ఉల్లంఘనలు పోలీసులకు కనిపించడంలేదా..?: కిషన్‌రెడ్డి


బండి సంజయ్‌ జాగరణ దీక్ష భగ్నం, అరెస్టులపై ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇదే అంశంపై ఇంతకముందే బీజేపీ నేతలు స్పందించారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సైతం ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో చెప్పాలని కిషన్‌రెడ్డి అన్నారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.టీఆర్‌ఎస్‌ నేతల కోవిడ్‌ ఉల్లంఘనలు పోలీసులకు కనిపించడం లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోవిడ్‌ నిబంధనల మేరకే బండి సంజయ్‌ దీక్ష చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Read Also:ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటన దురదుష్టకరం: మంత్రి కన్నబాబు

సంజయ్‌ దీక్ష చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. జీవో317 తీసుకురావడం ప్రభుత్వం తొందరపాటు చర్యకాదా అంటూ ధ్వజమెత్తారు. కరోనా నిబంధనలను టీఆర్‌ఎస్‌ నేతలే పాటించట్లేదు. కేసీఆర్‌ మాస్క్‌ పెట్టుకోవడం ఎప్పుడు చూడలేదు. మంత్రుల నల్లగొండ పర్యటనలోకూడా ఎవ్వరూ మాస్క్‌ పెట్టుకోలేదు. టీఆర్‌ఎస్‌ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అధికార పార్టీకి ఒకలా ప్రతిపక్షాలకు ఒకలా పోలీసుల వ్యవహరించడం భావ్యం కాదని కిషన్‌రెడ్డి అన్నారు.

Related Articles

Latest Articles