ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా ఆస్పత్రుల పై చర్యలు

కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. యూరోప్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్ ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పని చేయాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆక్సిజన్ ప్లాంట్స్, వాక్సిన్ లు, మందులు అందుబాటులోకి తీసుకువచ్చింది సర్కారు. తెలంగాణకు 1400 వెంటిలేటర్ లు 46 ఆసుపత్రులకు ఇచ్చాము. గత 74 ఏళ్లుగా 18 వేల వెంటిలేటర్ వినియోగిస్తే గత రెండు ఏళ్లలో 50 వెలకు పైగా వెంటిలేటర్ లు అందనంగా అందుబాటులోకి తెచ్చాము. 200 కోట్ల వ్యాక్సిన్ లను భారత్ లో తయారు చేసేలా ప్రణాళిక చేసినట్లు తెలిపారు. భారత్ బయోటెక్ కి 1500 కోట్ల రూపాయలు వ్యాక్సిన్ కోసం అడ్వాన్స్ ఇచ్చాము. 3వ వేవ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అనవసరం గా ప్రజలను భయపెట్టకూడదు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వాళ్ళ పై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చర్యలు తీసుకుంటాం. దుర్గా భాయ్ దేశముఖ్ ఆస్పత్రిలో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అని పేర్కొన్నారు. కేంద్రం వాక్సిన్ పై నిర్ణయించిన చార్జీల కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా ప్రయివేట్ ఆస్పత్రుల పై చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-