శ్రీశైలం మల్లన్న దర్శనానికి అమిత్‌ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం వెళ్లనున్నారు.. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌షా… ఆ తర్వాత బేగంపేట్‌ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లనున్నారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అక్కడే లంచ్‌ చేసి.. తిరిగి హెలికాప్టర్‌లో బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకోనున్న ఆయన.. అనంతరం తిరిగి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు.. మొత్తంగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన కొనసాగనుంది.

Related Articles

Latest Articles