కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.. డ్రోన్ ల ద్వారా మందులు, వాక్సిన్ సరఫరా

ప్రస్తుతం మన దేశంలో కరోనా సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకు 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుంది. ఈ సమయంలో డ్రోన్ ల ద్వారా ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు మందులు, వాక్సిన్ సరఫరా చేయాలనీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ప్రయోగాత్మకంగా మొదట తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నెల 11 న లాంఛనంగా వికారాబాద్ లో దీనిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి హాజరు కానున్నారు. సభ స్థలి, డ్రోన్ లు ఎగిరే ప్రాంతం, మీడియా గ్యాలరీ లను పరిశీలించి కలెక్టర్ కు పలు సూచనలు చేసారు మంత్రి సబితా. దేశ వ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండటం తో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Related Articles

Latest Articles

-Advertisement-