వెన‌క్కి త‌గ్గ‌ని కేంద్రం: ఇక అమ్మ‌కం లాంఛ‌న‌మే…

విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మ‌కంపై కేంద్ర‌ప్ర‌భుత్వం మ‌రోసారి త‌న స్ప‌ష్టమైన అభిప్రాయాన్ని చెప్పింది.  విశాఖ ఉక్కును అమ్మ‌డం ఖాయ‌మ‌ని తేల్చిచెప్పింది.  ఉక్కు ప‌రిశ్ర‌మలో త‌మ‌కున్న 100శాతం వాటాను అమ్మాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు కేంద్రం నిన్న రాజ్య‌స‌భ‌లో ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా తెలిపింది.  ఉక్కు క‌ర్మాగారంలో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌ను పునఃప‌రిశీలించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కోరింద‌ని, కానీ పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కేంద్ర ఆర్ధికశాఖ స‌హాయ‌మంత్రి భ‌గ‌వ‌త్ కిష‌న్ రావ్ క‌రాడ్ పేర్కొన్నారు.  

Read: బాలకృష్ణ, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ ?

రాజ్య‌స‌భ‌లో తెలుగుదేశం ఎంపి క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న ఈ విధంగా స‌మాధానం ఇచ్చారు.   విశాఖ స్టీల్‌లో పాటుగా దాని అనుబంధ సంస్థ‌లు, సంయుక్త వ్యాపా భాగ‌స్వామ్య సంస్థ‌ల్లో కేంద్రానికి ఉన్న వాటాల‌ను విక్ర‌యించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌రాడ్ స‌భ‌లో పేర్కొన్నారు.  కేంద్ర ప్ర‌భుత్వం ప‌బ్లిక్ సెక్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ పాల‌సీని విడుద‌ల‌న‌ల చేశామ‌ని, ఈ విధానం ప్ర‌కారం సంస్థ‌ల‌ను ప్రైవేటీక‌రించ‌మో లేదంటే మూసేయ‌డ‌మో చేయాల‌ని కరాడ్ తెల‌పారు.  ఇక‌, విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీలో త‌మ‌కున్న 100 శాతం వాటాను విక్ర‌యించ‌డం వ‌ల‌న ఆయా సంస్థ‌ల్లోకి గ‌రిష్టస్థాయిలో పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని, ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్షంగా ఉపాది అవ‌కాశాలు పెరుగుతాయ‌ని భ‌గ‌వ‌త్ కిష‌న్ రావ్ క‌రాడ్ తెలిపారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-