ముహూర్తం ఖరారు.. రేపే కేబినెట్‌ విస్తరణ

కేంద్ర కేబినెట్‌ విస్తరణకు సర్వం సిద్ధమైంది.. రేపు సాయంత్రం 5.30 – 6 గంటల మధ్య కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ జరగనుంది.. కనీసం ఆరుగురు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.. మొత్తంగా 20 మందికి పైగా కొత్తవారికి బెర్త్‌లు దక్కే అవకాశం ఉందని సమాచారం.. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలతో పాటు.. పెద్ద రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కొచ్చని చెబుతున్నారు.. కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో పాటు.. పాత మంత్రులకు షాక్‌ తప్పదనే ప్రచారం సాగుతోంది.. ఇక, కేబినెట్‌లో అవకాశం దక్కించుకున్నవారు.. వరుసగా బీజేపీ అధిష్టానాన్ని కలుస్తున్నట్టు తెలుస్తోంది..

ఈసారి విద్యాధికులు, ఎంబీఏ, పీజీ డిగ్రీలున్నవారికి, వృత్తి నిపుణులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.. ఇతర వెనుకబడిన వర్గాలకూ అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది.. గతంలో ఎన్నడూ లేని రీతిలో యువతకు ప్రాధాన్యత ఇవ్వనుండగా.. అన్ని రాష్ట్రాలకు, రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాలనా అనుభవం ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, తగిన సంఖ్యలో మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.. తృణమూల్‌ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన దినేష్ త్రివేది, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన జితిన్ ప్రసాదకు కూడా అవకాశం ఉందని సమాచారం.. నరేంద్ర మోడీ కేబినెట్‌లో జ్యోతిరాదిత్య సింధియా (మధ్య ప్రదేశ్), సర్బానంద సోనోవాల్ (అస్సాం), నారాయణ రాణే (మహారాష్ట్ర), అనుప్రియా పటేల్ (ఉత్తర్ ప్రదేశ్ ), పంకజ్ చౌధురి (ఉత్తర్ ప్రదేశ్), రీటా బహుగుణ జోషి (ఉత్తరప్రదేశ్), రామశంకర్ కథేరియా (ఉత్తరప్రదేశ్), వరుణ్ గాంధీ (ఉత్తరప్రదేశ్), పశుపతి పారస్ ( బీహార్), ఆర్‌సీపీ సింగ్ ( బీహార్), లల్లన్ సింగ్ ( బీహార్), రాహుల్ కశ్వన్ ( రాజస్థాన్), చంద్ర ప్రకాష్ జోషి (రాజస్థాన్), వైజయంత్ పాండా ( ఒడిశా), కైలశ్ విజయవర్గీయ (మధ్యప్రదేశ్) తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-