రిపబ్లిక్ డే కంటే ముందే ‘ఉనికి’

‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా ‘ఉనికి’. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్నారు. గణత్రంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు తొలుత భావించారు. అయితే సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు తప్పుకోవడంతో ‘ఉనికి’ మూవీని జనవరి 15న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.

ఈ మూవీ గురించి నిర్మాతలు బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ “ఇదొక డ్రామా థ్రిల్లర్. సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఒక యువతి, కష్టపడి చదివి కలెక్టర్ అవుతుంది. సమాజానికి మంచి చేయాలని ముందుకొచ్చిన ఆవిడకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించి తన ‘ఉనికి’ని చాటుకుంది? అనేది సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా సినిమా ఉంటుంది” అని అన్నారు. ఈ చిత్రంలో టీఎన్ఆర్, ‘రంగస్థలం’ నాగ మహేష్, అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గారావు, పద్మశ్రీ, బండి స్టార్ కిరణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Related Articles

Latest Articles