బ్రిట‌న్‌ను భ‌య‌పెడుతున్న ఆ బాంబులు… ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు

రెండో ప్ర‌పంచ యుద్దం స‌మ‌యంలో జ‌ర్మ‌నీ ద‌ళాలు పెద్ద ఎత్తున యూరోపియ‌న్ దేశాల‌పై దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. జర్మ‌నీ, దీని మిత్ర‌ప‌క్షాలు బ్రిట‌న్‌పై పెద్ద ఎత్తున బాంబు దాడిని చేశారు. అప్ప‌ట్లో జ‌ర్మనీ వేసిన బాంబుల్లో కొన్ని పేల‌గా చాలా వ‌ర‌కు అవి పేల‌లేదు.  కాగా, అవి కాల‌గ‌ర్బంలో భూమిలో క‌లిపిపోయాయి.  కాగా, ఇప్పుడు ఆ బాంబులు బ్రిట‌న్‌ను ఇబ్బందులు పెడుతున్నాయి.  పేల‌కుండా భూమిలో ఉండిపోయిన బాంబుల‌ను అక్క‌డి ప్ర‌త్యేక అధికారులు ఒక్కొక్క‌టిగా నిర్వీర్యం చేస్తున్నారు.  రెండో ప్ర‌పంచ యుద్దం త‌రువాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా 45 వేల‌కు పైగా బాంబుల‌ను నిర్వీర్యం చేసి ఉంటారు.  అయితే,  ఇటీవ‌ల ఎక్సేట‌ర్ ప్రాంతంలో 2,200 ఎల్బీ బాంబు బ‌య‌ట‌ప‌డింది.  ఓ ఇంటిని మ‌రమ్మ‌త్తులు చేస్తుండ‌గా ఈ బాంబు బ‌య‌ట‌ప‌డింది. దీంతో స‌మాచారం అందుకున్న అధికారులు… చుట్టుపక్క‌ల ప్రాంతంలోని ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయచేయించి వెయ్యి కేజీల బాంబును పేల్చివేశారు.  వెయ్యికేజీల బాంబు బ‌య‌ట‌ప‌డ‌టంతో మ‌రిన్ని బాంబులు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.  ప్ర‌భుత్వంతో పాటుగా ప్రైవేట్ సంస్థ‌లు కూడా బాంబుల‌ను అక్క‌డ నిర్వీర్యం చేస్తున్నాయి. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-