ఆ భయంతో సెల్ ఫోన్ మింగేసిన ఖైదీ.. పరిస్థితి విషమం

సాధారణంగా ప్రతి మనిషికి ఒక భయం ఉంటుంది. ఆ భయంతోనే కొన్ని అనుకోని తప్పులు చేస్తాడు. కొన్నిసార్లు ఆ భయాలు వారి ప్రాణాలమీదకు తెస్తాయి. తాజాగా ఒక ఖైదీ.. అధికారులు తనను ఏమన్నా చేస్తారన్న భయంతో ముందు వెనుక చూడకుండా సెల్ ఫోన్ ని మింగేశాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఢిల్లీ తీహార్ జైల్లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. తీహార్ జైలు నెం. 1 లో ఒక వ్యక్తి  అండర్ ట్రయల్ ఖైదీగా వచ్చాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నా ఆ తరువాత అతడు తనతో పాటు తెచ్చిన మొబైల్ ని వాడడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అతడిని చెక్ చేయడానికి బయలుదేరారు. అది గమనించిన సదురు ఖైదీ ఫోన్ పోలీసులకు చిక్కితే తనను ఏం చేస్తారనే భయంతో ముందు వెనుక చూడకుండా సెల్ ఫోన్ ని మింగేశాడు. అనంతరం కడుపునొప్పి రావడంతో అధికారులకు విషయం చెప్పాడు. దీంతో వెంటనే అతనిని  డీడీయూ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని, కడుపులో ఫోన్ ని ఆపరేషన్ చేసి తీయాలని వైద్యులు సూచించారని పోలీసులు తెలిపారు.

Related Articles

Latest Articles