అమానుషం.. కోడలిని అమ్మేసిన మామ..

మామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి.. కానీ, డబ్బుల కోసం ఆశపడి తన కోడలినే అమ్మేశాడు… తన కుమారుడి భార్యను రూ.80 వేలకు ఓ ముఠాకు అమ్మేందుకు సిద్ధపడి డీల్ కుదుర్చుకున్నాడు.. అయితే, ఈ విషయం కుమారుడికి తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు.. దీంతో, దాని వెనుక ఉన్న ఓ ముఠా గుట్టురట్టుఅయ్యింది.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారబంకీ జిల్లా మల్లాపుర్‌ లో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన కోడలిని గుజరాత్‌కు చెందిన ఓ ముఠాకు రూ.80వేలకు అమ్మేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఓ వ్యక్తి.. బాధితురాలి భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలితో సహా రైల్వేస్టేషన్‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.. బాధితురాలు వారి చెరలో పడకుండా విడిపించారు. మొత్తంగా ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా.. అందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అయితే, ప్రధాన నిందితుడు, బాధితురాలి మామ అయిన చంద్రరామ్‌, మరో నిందితుడు పరారీలో ఉన్నారు. కాగా, చంద్రరామ్‌ కు మహిళలను అమ్మడం కొత్తకాదని.. ఇప్పటివరకు 300 మంది మహిళలను కొనుగోలు చేసి.. ఇతర వ్యక్తులకు విక్రయించినట్టు ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా తన కోడలినే అమ్మడం.. అది కుమారుడికి తెలియడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-