అమెరికాలో వ్యాక్సిన్ ర‌చ్చ‌… వ్యాక్సిన్ తీసుకోకుంటే…

అమెరికాలో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వ్య‌క్తులు చాలా మంది ఉన్నారు.  వ్యాక్సిన్ల కొర‌త లేన‌ప్ప‌టికీ మ‌త‌ప‌ర‌మైన కార‌ణాలు, ఇత‌ర సొంత కార‌ణాల వ‌ల‌న వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి చాలా మంది నిరాక‌రిస్తున్నారు.   వ్యాక్సిన్ తీసుకోని వారిపై వివ‌క్ష మొద‌లైంది.  ట్యాక్సీల్లో ప్ర‌యాణం చేయాలంటే తప్ప‌ని స‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని కొన్ని ట్యాక్సీ సంస్థ‌లు నిబంధన‌లు పెడుతున్నాయి.  ఉద్యోగాల విష‌యంలో కూడా ఈ నిబంధ‌న‌లు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఉద్యోగాలు చేస్తున్న చోటనే వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సంస్థ‌లు ముందుకొస్తే 16 శాతం మంది ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకుంటామ‌ని చెబుతుండ‌గా, 35 శాతం మంది మిన‌హాయింపులు కోరుతుండ‌గా, 42 శాతం మంది పూర్తిగా వ‌దిలేస్తామ‌ని చెబుతున్నారు.  ఒక‌వేళ త‌ప్ప‌నిస‌రి అంటే 18 శాతం మంది వ్యాక్సినేష‌న్ తీసుకుంటామ‌ని, 72 శాతం మంది ఉద్యోగాలు వ‌దిలేస్తామ‌ని చెబుతున్నారు.  

Read: టీడీపీలో రాయలసీమ స‌ద‌స్సు చిచ్చు…

Related Articles

Latest Articles

-Advertisement-