వాటిని ప్యాకింగ్ చేసే ఉద్యోగాల‌కు రూ.63 ల‌క్ష‌ల జీతం…

క‌రోనా స‌మ‌యంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.  ఆర్థిక భారాన్ని తగ్గించుకోవ‌డానికి ఉద్యోగుల‌ను తొల‌గిస్తూ వ‌చ్చారు. అయితే, యూకేకి చెందిన ఓ ప్యాకింగ్ కంపెనీ ఓ భారీ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. తమ కంపెనీ పొలంలో పండించిన క్యాబేజీల‌ను తెంపి, ప్యాకింగ్ చేసేందుకు ఉద్యోగులు కావాల‌ని, ఈ ఉద్యోగాల‌కు సెల‌క్ట్ అయిన ఉద్యోగుల‌కు ఏడాదికి 62,400 పౌండ్ల జీతం ఇవ్వ‌నున్న‌ట్టు పేర్కొన్న‌ది. అంటే మ‌న క‌రెన్సీలో చూసుకుంటే దాదాపుగా రూ.63.20 ల‌క్ష‌లు.  క్యాబేజీలు కోసి, ప్యాకింగ్ చేస్తే ఈ స్థాయిలో జీతం ఇస్తారా.. అని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  టిహెచ్ క్లెమెంట్స్ అండ్ స‌న్ లిమిటెడ్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.  

Read: లద్దాఖ్‌లో ఆర్మీచేతికి సరికొత్త‌ ఆయుధం…

-Advertisement-వాటిని ప్యాకింగ్  చేసే ఉద్యోగాల‌కు రూ.63 ల‌క్ష‌ల జీతం...

Related Articles

Latest Articles