ఉధంపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం..

కరోనా సమయంలో పూర్తిగా నిలిచిపోయాయి రైల్వే సర్వీసులు.. కొన్ని ప్రత్యేక సర్వీసులు తప్ప.. మిగతా ఏ రైలు కూడా పట్టాలు ఎక్కిన పరిస్థితి లేదు.. అయితే, సాధారణ పరిస్థితులు వస్తున్న తరుణంలో క్రమంగా అన్ని సర్వీసులను తిప్పుతున్నారు.. ఈ తరుణంలో ఉధంపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది… జ‌మ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మంట‌లు చెల‌రేగాయి. రెండు ఏసీ కోచ్‌ల‌లో మంట‌లు అంటుకోగా.. ఆ తర్వాత క్షణాల్లోనే మ‌రో రెండు ఏసీ కోచ్‌ల‌కు వ్యాపించాయి.. ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు..

Read Also: బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు.. 80 కాదు కదా 8 సీట్లు వస్తే గొప్ప..!

అయితే.. వెంటనే స్పందించిన సిబ్బంది రైలును నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది.. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా.. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. రాజ‌స్థాన్‌లోని ధౌల్‌పూర్, మ‌ధ్య‌ప్రదేశ్‌లోని మోరినా మ‌ధ్య ఈ అగ్నిప్రమాదం జరగగా.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుచేచేశారు.. ఓ కోచ్‌లోని ఏసీలో మంట‌లు చెలరేగడంతో.. ఆ తర్వాత క్రమంగా మంటలు వ్యాపించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ రైలు నిలిపివేయబడింది.. ఈ మార్గంలోని అన్ని ఇతర రైళ్లు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

Related Articles

Latest Articles