బాలయ్య మూవీకి ‘నో’ చెప్పిన ఇద్దరు భామలు ?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం ‘అఖండ‌’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ త‌ర్వాత బాల‌కృష్ణ, మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌బోతున్నాడు. బాలకృష్ణ ఇమేజ్ కి సరిపోయేలా గోపీచంద్ ఓ చరిత్రకారుని కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడట. పల్నాటి ప్రాంతానికి చెందిన ఆ చరిత్రకారుని కథకి బాలయ్య నూటికి నూరు పాళ్లు యాప్ట్ అంటున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించే ఈ మూవీలో క‌థానాయిక విషయంలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో హీరోయిన్ ను సెట్ చేయడం కోసం నిర్మాతలు చాలా కష్టపడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే స్టార్ నటీమణులు శృతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్ లను సంప్రదించారట. కానీ వారిద్దరూ ఈ ఆఫర్ ను తిరస్కరించారని తెలుస్తోంది. ప్రస్తుతం శృతి ‘సలార్’తో పాటు రెండు తమిళ, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, రకుల్ కూడా బాలీవుడ్ లో రెండు ప్రాజెక్టులు చేస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-