ఏపీ యువతిపై బెంగళూరులో అఘాయిత్యం.. ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిపై బెంగళూరులో అఘాయిత్యం జరిగింది… బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి చెందిన యువతి.. బెంగళూరులోని ఓ సంస్థలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. అయితే, కొద్ది రోజుల క్రితం టోనీ అనే నైజీరియన్ తో ఆమెకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ఫోన్లు మాట్లాడుకునే వరకు వెళ్లింది.. తాజాగా ఇద్దరం ఓసారి కలుద్దామని నిర్ణయానికి వచ్చారు.. ఇదే క్రమంలో ఆగస్టు 31వ తేదీన సదరు యువతి కమ్మరహళ్లిలోని టోనీ ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నారు.. మద్యం మత్తులో నిద్రలోకి జారుకుంది ఆ యువతి.. కానీ, ఉదయం నిద్ర లేచేసరికి ఆమెకు అసలు విషయం అర్థమైంది..

ఎందుకంటే.. ఉదయం నిద్రలేచేసరికి తన పక్కన మరో యువకుడు నగ్నంగా ఉండటం చూసి షాక్‌కు గురైంది.. రాత్రి తాను మద్యం మత్తులో ఉన్న సమయంలో టోనీతో పాటు మరో యువకుడు కూడా తనపై అత్యాచారం చేశాయని గ్రహించింది.. అతను టోనీ స్నేహితుడు ఉబాకాగా గుర్తించింది. గతంలోనూ అతను తనకోసారి మెసేజ్‌ చేసినట్లు గుర్తు తెచ్చుకుంది. తనను కలిసేందుకు అతడు ప్రయత్నించగా ఆమె అతడిని దూరం పెడుతూ వచ్చింది.. బాకా గురించి టోనీని ఆమె ప్రశ్నించగా.. అతనెవరో తనకు తెలియదని బుకాయించాడు. దీంతో బాన్సవాడి పోలీసులను ఆశ్రయించింది బాధిత యువతి.. తనపై ఇద్దరు నైజీరియన్లు అత్యాచారానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొంది.. మరోవైపు.. ఆ యువతికి ఇద్దరు నైజీరియన్లతో కొంతకాలంగా పరిచయం ఉందని.. సోషల్ మీడియా ద్వారా వీరు స్నేహితులుగా మారారని.. ఈ క్రమంలో ఆగస్టు 31న రాత్రి యువతి వారి ఇంటికి వెళ్లింది.. అక్కడ ఆమె శీతల పానీయం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతే.. ఇద్దరు నైజీరియన్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారనే వర్షన్‌ కూడా ఉంది.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రహించిన ఆమె.. ఆ తర్వాత బాన్సవాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Related Articles

Latest Articles

-Advertisement-