దారుణం: స్నేహితుడి భార్యపై కన్ను.. అర్ధరాత్రి ఇంట్లోకి దూరి బలవంతంగా

నమ్మినవారే మోసం చేస్తూ ఉంటారు అనేది అందరికి తెలిసిందే.. ఎన్నోసార్లు అలాంటి ఘటనలను చూస్తూనే ఉంటాం.. తాజాగా స్నేహితులని నమ్మి ఇంటికి తీసుకువచ్చిన ఒక వ్యక్తికి దారుణ పరిస్థితి ఎదురయ్యింది. ఇద్దరు స్నేహితులు అతడికి మాయమాటలు చెప్పి, మందు తాగించి, స్నేహితుడి భార్యనే అత్యచారం చేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. బతుకుదెరువు కోసం ఎన్నో ఊళ్లు దాటుకుంటూ ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం తారామతిపేటకు చేరుకున్నాడు. అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ భార్యాభర్తలు బ్రతుకుతున్నారు. ఇక ఆ గ్రామంలో భర్తకు మరో ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారడంతో వారు అప్పుడప్పుడు స్నేహితుడు ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఈ క్రమంలోనే వారి కన్ను స్నేహితుడి భార్యపై పడింది. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్లాన్ వేశారు.

అనుకున్నట్లుగానే సోమవారం రాత్రి స్నేహితుడితో పాటు వారింటికి వెళ్లారు. అక్కడ అతడికి ఫుల్లుగా మందు తాగించి స్పృహ లేకుండా చేసి, అతడి భార్యపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను బలవంతంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు.. ఆమె వారిని ప్రతిఘటించడంతో దారుణంగా హతమార్చి అనంతరం రేప్ చేసి పరారయ్యారు. మంగళవారం ఉదయం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్నీ పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకడైన సురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

Latest Articles