సాయిరాం ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో రెండు సినిమాలు!

యార్లగడ్డ వెంకట రమణ నిర్మాణ సారధ్యంలో సాయిరాం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఆవిర్భావ సభ పూజాకార్యక్రమాలతో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”సాయిరాం ప్రొడక్షన్స్ ఇవాళ ఆవిర్భవించింది. ఒక మంచి రోజున ఈ నిర్మాణ సంస్థ మొదలవడం ఆనందంగా ఉంది. నిర్మాత పద్మారెడ్డి చాలా ఏళ్లుగా తెలుసు. ఆయన సినిమా ఇండస్ట్రీ లో ముప్పై ఏళ్లుగా ఉన్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి గారితో ఆయన పనిచేసేవారు. ఇప్పుడు ఈ సాయిరాం ప్రొడక్షన్స్ ను ఆరంభించారు. త్వరలోనే రెండు సినిమాలను చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల స్క్రిప్ట్స్ చాలా బాగున్నాయి” అని అన్నారు.

సాయిరాం ప్రొడక్షన్స్ అధినేత యార్లగడ్డ వెంకట రమణ మాట్లాడుతూ, ”మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలన్న ఆకాంక్షతో, ఎంతో ప్యాషన్ తో ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించాం. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలన్నది మా లక్ష్యం. మా బ్యానర్ నుండి శ్రీపాల్ రెడ్డి, వీర అనే ఇద్దరు దర్శకులను పరిచయం చేయబోతున్నాం. బీఎస్వీ పద్మారెడ్డి సమర్పణ లో జి. లక్ష్మి రెడ్డి సహా నిర్మాతగా, సాంబశివరావు కామేపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఈ చిత్రాలకు వ్యవహరిస్తారు. అతి త్వరలోనే నటీనటులు, ప్రధాన సాంకేతిక నిపుణులు వివరాలను తెలియచేస్తాం” అని అన్నారు.

-Advertisement-సాయిరాం ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో రెండు సినిమాలు!

Related Articles

Latest Articles