ఒకే మ‌నిషిలో రెండు వేరియంట్లు…

ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్ర‌భావం చూపుతున్న‌ది.  కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకున్నా క‌రోనా సోకుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.  క‌రోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గం అని ప్ర‌పంచ దేశాలు ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తున్నాయి.  పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌లు అందిస్తున్నారు.  అయిన‌ప్ప‌టికీ, క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోకి రావ‌డంలేదు.  త‌గ్గిన‌ట్టే తగ్గి తిరిగి కొత్త‌గా వ్యాపిస్తున్న‌ది.  ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో క‌రోనా వేరియంట్లు విజృంభిస్తున్నాయి.  అయితే, బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలిలో ప్ర‌పంచంలో ప్ర‌మాద‌క‌ర‌మైన ఆల్ఫా, బీటా వేరియంట్లు క‌నిపించాయి.  

Read: ‘లైగర్’ హీరోయిన్‌ ఇంట విషాదం

ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఆమె మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు పేర్కొన్నారు.  రెండు వేరియంట్లు వేరువేరు మ‌నుషుల ద్వారా ఆమెకు సోకి ఉంటాయ‌ని, అయితే, రెండు వేరియంట్లు ఒకే మ‌నిషికి ఎలా సోకాయి అన్న‌ది అంతుచిక్క‌డం లేద‌ని ఆమెకు వైద్యం అందించిన వైద్యులు పేర్కొన్నారు.  ప్ర‌మాద‌క‌ర‌మైన ఒక వేరియంట్ నుంచి కోలుకోవ‌డం క‌ష్టంగా ఉన్న త‌రుణంలో రెండు వేరియంట్లు ఒకే మ‌నిషిపై దాడి చేస్తే ప‌రిస్థితులు ఏంటి అన్న‌ది ప్ర‌పంచం ముందున్న ప్ర‌శ్న‌.  వ్యాక్సిన్లు ఒక మ‌నిషిలోని రెండు వేరియంట్ల‌పై స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తాయా? 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-