చిన్నారులను హతమార్చిన కన్నతల్లి…

రాజమండ్రిలో ఇద్దరు చిన్నారులను హతమార్చింది కసాయి తల్లి పూరేటి లక్ష్మీ అనుష్క. ఆమెను అదుపులోకి తీసుకున్నారు త్రీటౌన్ పోలీసులు. తల్లిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారు. లక్ష్మీ అనుష్క కు పలువురితో అక్రమ సంబంధం, సురేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. తల్లి, తమ్ముడు అనుమానిస్తున్నారని మనస్తాపం చెంది పిల్లలను హతమార్చి అనుష కూడా ఆత్మహత్య చేసుకోవాలని పథకం ప్రకారమే చేసిందని చెప్పుతున్నారు పోలీసులు. నాలుగేళ్ల క్రితం అనుష్క వేధింపులు కారణంగానే భర్త రాము ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిత కేసు ఉంది. మృతులు చిన్మాయి, మోహిత్ ల మృతదేహాలకు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి పోస్టుమార్టం కోసం పంపారు. నిందితురాలు అనుష్క మతిస్థిమితం లేక అనారోగ్యంగా ఉన్న కారణంగా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షలు అనంతరం నిందితురాలిని అరెస్టు చేస్తామంటున్నారు త్రీటౌన్ సి.ఐ. మధుబాబు.

-Advertisement-చిన్నారులను హతమార్చిన కన్నతల్లి...

Related Articles

Latest Articles