తెలుగు అకాడమీ కేసు.. ఇద్దరు బ్యాంక్‌ మేనేజర్ల అరెస్ట్

తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్ వ్యవహారం సంచలనం సృష్టించింది.. ఈ వ్యవహారంలో తవ్వినా కొద్ది.. గోల్‌మాల్‌ అయిన డబ్బుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. అయితే, ఈ కేసులో ఓవైపు డిపార్ట్‌మెంటల్‌ విచారణ సాగుతుండగా.. మరోవైపు.. తెలుగు అకాడమీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇవాళ ఇద్దరిని అరెస్ట్ చేశారు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ మేనేజర్ పద్మావతిని అరెస్ట్ చేశారు పోలీసులు.. కాగా, ఇప్పటి వరకు తెలుగు అకాడమీకి చెందిన నిధుల్లో మొత్తం రూ. 70 కోట్లు మాయమైనట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఆ నిధులను ఇద్దరు కలిసి స్వాహా చేసినట్లుగా చెబుతున్నారు. తెలుగు అకాడమీకి చెందిన ఎఫ్‌డీలను ఆ ఇద్దరు మేనేజర్లు కలిసి డ్రా చేసుకున్నట్టుగా భావిస్తున్నారు.. మరోఐపు.. ఈ కేసుపై నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక సిద్ధమైంది.. త్వరలోనే నివేదిక ప్రభుత్వానికి అందనుంది.

-Advertisement-తెలుగు అకాడమీ కేసు.. ఇద్దరు బ్యాంక్‌ మేనేజర్ల అరెస్ట్

Related Articles

Latest Articles