టోక్యో ఒలంపిక్స్ లో కరోనా కలకలం…

టోక్యో ఒలంపిక్స్ విలేజ్ లో కరోనా కలకలం రేపింది. నేడు నిర్వహించిన కరోనా పరీక్షలో ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఒలంపిక్స్ విలేజ్ లో నిన్న తొలి కరోనా కేసు నమోదు కావడంతో ఈరోజు అక్కడ అందరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఇద్దరికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఇక ఒలంపిక్స్ విలేజ్ లో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రతిరోజు క్రీడాకారులకు కరోనా పరీక్షలు చేయనున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. అయితే ఈ నెల 23 నుండి ఈ క్రీడలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-