ట్విట్టర్‌పై కేంద్రం సీరియస్…

కొత్త నిబంధ‌న‌లు ఇప్పుడు భార‌త ప్ర‌భుత్వం, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్ట‌ర్ మ‌ధ్య వివాదానికి దారి తీశాయి.. ఇక‌, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్నట్విట్ట‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌రింత దుమారాన్నే రేపుతున్నాయి.. దీనిపై కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ట్విట్ట‌ర్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం.. ఇది, ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలుగా ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి.. ఇప్పుడు ట్విట్ట‌ర్ పాఠాలు నేర్పుతోందని ఫైర్ అయ్యింది కేంద్రం.. ఉద్దేశ్యపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘిస్తోంద‌ని.. నిబంధనల గురించి పాఠాలు నేర్పేందుకు ట్విట్ట‌ర్ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని.. భారత న్యాయ వ్యవస్థను దెబ్బతీయాలని ట్విట్ట‌ర్ చూస్తోందంటూ కేంద్రం ఘాటుగా స్పందించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-