భారత మాజీ కెప్టెన్ ధోనికి ట్విట్ట‌ర్ షాక్…

భార‌త మాజీ కెప్టెన్ ధోనికి ట్విట్టర్ షాకిచింది.. ధోని వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ ఖాతా నుంచి అధికారిక బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యూడ్జ్‌ను తొల‌గించింది సోష‌ల్ మీడియా దిగ్గ‌జం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా ధోనికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ట్విట్టర్ లో ధోనిని దాదాపు 82 లక్షల మంది ఫాలో అవుతుండ‌గా.. కెప్టెన్ కూల్ 33 మందిని ఫాలో అవుతున్నారు.. అయితే, ట్విట్ట‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. ధోని తన ట్విట్టర్ ను చాలా తక్కువగా ఉపయోగిస్తాడు. ఎంతలా అంటే… అకౌంట్ లో చివరగా ధోని ఈ ఏడాది జనవరి 8 న పోస్ట్ వేసాడు.

Related Articles

Latest Articles