టీవీఎస్ స్కూటీ అరుదైన రికార్డు

టీవీఎస్ సంస్థకు చెందిన టూ వీలర్ వాహనాలలో స్కూటీలకు ఉన్న ప్రత్యేకతే వేరు. భారత్‌లో టీవీఎస్ స్కూటీలు ఎంత ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టీవీఎస్ స్కూటీల విక్రయాలు భారత్‌లో 50 లక్షల మైలురాయికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా టీవీఎస్ సంస్థ వెల్లడించింది. మూడు దశాబ్దాలుగా తమ స్కూటీ వాహనాలకు మహిళలకు మెరుగైన ఎంపికగా ఉన్నందుకు తమకు గర్వగా ఉందని ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇతర కంపెనీలతో పోలిస్తే తమ స్కూటీ వాహనం 15 శాతం మెరుగైన మైలేజ్ ఇస్తుందని.. అందుకే తమకు ఇంతటి ఆదరణ దక్కిందని వెల్లడించింది.

Read Also: దేశంలో 13 ఎయిర్‌పోర్టులను అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం

గేర్‌లెస్ వాహనాల విభాగంలో గత కొన్నేళ్లుగా తమ కంపెనీ స్థిరమైన కొనుగోళ్లను కలిగి ఉన్నట్లు టీవీఎస్ కంపెనీ తెలియజేసింది. టీవీఎస్ స్కూటీ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తో పాటు కంఫర్ట్ రైడింగ్, ఈజీ స్టాండింగ్ టెక్నాలజీని కలిగి ఉందని తెలిపింది. ఈ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన అనంతరం రెండేళ్లలోనే మహిళలు ఈ స్కూటీ వాహనాలను అధికంగా కొనుగోలు చేసినట్లు పేర్కొంది. మహిళల కోసం ఎప్పటికప్పుడు స్కూటీ వాహనాలను రీమోడలైజ్ చేస్తూ మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా ఆదరణ పొందామని తెలిపింది.

Related Articles

Latest Articles