టక్ జగదీష్ : సల్లాటి కుండలో .. సల్ల సక్క మనసు వాడు సాంగ్

నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం “టక్ జగదీష్”. ఇందులో నానితో రీతూ వర్మ రొమాన్స్ చేస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. “నిన్ను కోరి” తర్వాత నాని, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న రెండవ చిత్రం “టక్ జగదీష్”. జగపతి బాబు, నాసర్, ఐశ్వర్య రాజేష్, రోహిణి ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా, సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read Also : “రిపబ్లిక్” సెకండ్ సింగిల్ కు టైం ఫిక్స్

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ అంశాలను కూడా కలగలిపి యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా “టక్ జగదీష్” నుంచి “సల్లాటి కుండలో .. సల్ల సక్క మనసు వాడు” అనే మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కేవలం సాంగ్ మాత్రమే కాకుండా ఈ వీడియోలో ముందుగా నాని, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఆసక్తికరమైన సంభాషణను పెట్టారు. విశేషం ఏమిటంటే ఈ సాంగ్ కు చిత్ర దర్శకుడు శివ నిర్వాణ లిరిక్స్ అందించడమే కాకుండా స్వయంగా పాడారు కూడా. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Related Articles

Latest Articles

-Advertisement-