ట్రైలర్: లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ‘టక్ జగదీష్’ వచ్చేశాడు

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా ‘టక్ జగదీష్’.. నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాజర్‌, జగపతిబాబు, నరేశ్‌, రావురమేశ్‌, రోహిణి కీలక పాత్రలు పోషించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ మొత్తం ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ తో నిండిపోయింది. గ్రామీణ నేపథ్యంలో కుటుంబాలు, బంధాలు, భూ గొడవలు చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్లుగా ట్రైలర్ బట్టి చూస్తే అర్ధమవుతోంది. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించారు. తమన్ సంగీతాన్ని అందించారు. నాని.. శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దీంతో టక్ జగదీష్ పై అంచనాలు పెరిగాయి.

Related Articles

Latest Articles

-Advertisement-