‘టక్‌ జగదీష్‌’పై.. ఆ టాక్ నమ్మకండి

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర పోషించారు. కాగా ‘టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదల కావలసింది. కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల మేకర్స్ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ముగిసి, థియేటర్ల తెరచుకునేందుకు అనుమతి లభించడంతో ఈ సినిమా ఈ నెలాఖరున వస్తుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. టక్‌ జగదీష్‌ చిత్ర విడుదలకి సంబంధించి వస్తున్న వార్తల్ని నమ్మవద్దు అంటూ పేర్కొన్నారు. ఒకవేళ విడుదల ఖరారైతే దర్శకనిర్మాతలే ప్రకటిస్తారని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-