13న జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమి పూజ‌..

ఈ నెల 13వ తేదీన జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమిపూజ నిర్వ‌హించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి… జ‌మ్మూలోని మజీన్ గ్రామం వద్ద ఆలయ నిర్మాణం జ‌ర‌గ‌నుంది… రెండో ద‌శ‌లో ఆల‌య నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తోంది టీటీడీ.. ఆలయంతో పాటు వేదపాఠశాల, యాత్రికులకు వసతి సముదాయం నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు.. ఆలయ ప్రాంగణంలో కట్టడాలని రాతిని వినియోగిస్తామ‌ని తెలిపారు. కాగా, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇప్ప‌టికే టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయించింది అక్క‌డి ప్ర‌భుత్వం.. టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి బృందం జ‌మ్మూకు వెళ్లి.. ఇప్ప‌టికే స్థ‌లాన్ని కూడా ప‌రిశీలించివ‌చ్చింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-