శేషాచల నగర్ లో ఇంటిని స్వాధీనం చేసుకున్న టిటిడి…

కరకం బాడి మార్గంలోని టీటీడీకి చెందిన శేషాచల నగర్ లోని 75వ నెంబర్ ఇంటిని స్వాధీనం చేసుకుంది టిటిడి. పంచనామా సందర్బంగా ఇంట్లోని పెట్టెలో 6 లక్షల 15 వేల 50 రూపాయల తో పాటు దాదాపు 25 కిలోల చిల్లర నాణాలు స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ఈ మొత్తం స్వాధీనం చేసుకున్న దానిని టీటీడీ ఖజానాకు జమ చేశారు అధికారులు. అయితే 2008లో టీటీడీ ఆ ఇంటిని తిరుమలకు చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తికి పునరావాసం కింద కేటాయించింది. ఏడాది కాలంగా శ్రీనివాసన్ ఇంట్లో లేకపోవడం….ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూ లేక పోవడంతో కొంతమంది వ్యక్తులు ఇంటిని ఆక్రమించి, విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదుతో టీటీడీ తిరిగి ఇల్లు స్వాదీనం చేసుకుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-